నువ్వు ఎంచుకున్నది నీనేస్తాన్ని.

నీహారికా,

న్యూఇయర్ రిజల్యుషన్ గా రోజుకోపుస్తకం చదువుతున్నావు. ఇవ్వాల్టికి ఐదు రోజులు. ఐదు పుస్తకాలు పూర్తి చేసావా? ఇలాంటి వాటికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడు. ఏ గుర్తింపు దొరకదు. కానీ మన మనస్సు మనకు గుర్తింపు ఇస్తుంది. మాట పైన నిలబడగళం  అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక నమ్మకం దొరికితే చాలు, ఒక్క మెట్టు ఎక్కితే చాలు ఎన్నో మెట్లు అవలీలగా ఎక్కేయగలం. చాలా కష్టం  కొన్ని పనులు, స్వీట్లు సంవత్సరం పాటు తినని ఆ అనుభవాలతో పుస్తకం రాసిన ఒక రాచయిత్రి ఇవ్వాళ సెలబ్రెటీ అడ్వయిజర్. ఆమె చెప్పిన సలహాలు పాటిస్తే ఎవరైనా జీరో సైజుకు రావొచ్చు లేదా బరువు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. అందంగా ఉందాం అంటే అర్గ్యంగా వుండటం కుడా కదా. నువ్వు జనవర్ ఒకటినాడు శపధం పట్టినట్లు పుస్తకంలో రాసుకో. సెలక్టివ్ గా మంచి రచనలు, నిన్న ఎన్నో అలవాట్ల నుంచి బయట పడేసేవి, గమ్యాన్ని నిర్ణయించేవి, కధలు, కవితలు, నవలలు ఎన్నో కేటగిరీలున్నాయి. ఇవన్నీ జీవితానికి చాలా అవసరం. చీకట్లో వెలుగు చూపే దీపాలు పుస్తకాలు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైంది. నీకు తోడుగా జీవితాంతం వుండేడి పుస్తకం ఒక్కటే.