ఓట్ మీల్ శరీర సౌష్టవం కోసమే కాదు చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది చర్మ రంధ్రాల్లో ని  మురికిని, జిడ్డును తొలగించి శుభ్రం చేస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ నీళ్లలో వేసి ఉడికించి చల్లారిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ఓట్ మీల్ తయారీ చాలా సులభం లేదా మీరు ఏవైనా సరే వాటిలో ఓట్స్ నాననిచ్చి తినవచ్చు అరటి, దానిమ్మ, పైనాపిల్, బాదం పప్పులు జోడిస్తే రుచిగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు చక్కని ఆహారం ఓట్స్, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మ్యాంగనీస్, ఇనుము వంటి ఖనిజాలు మెండుగా ఉండే ఓట్స్  చక్కని బ్రేక్ ఫాస్ట్ కూడా.

Leave a comment