చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్ గా తయ్యారవ్వాల్సి వస్తుంది. మరీ గాడీగా కాకపోయినా మేకప్ వుండాలి. కొందరు అసలు మేకప్ వద్దంటారు, మరి కొందారు కాస్త టచప్ చాలంటారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో ఫ్రెష్ లుక్ తో కనిపించాలంటే ఈ రెండింటిని నడుమ బాలెన్స్ ఉండాలి. ఫార్మల్ వాతావరణంలో మేకప్ హుందాగా వుండాలి. బ్రైట్ కలర్ ఐషాడోలు, లైనర్లు వంటి వాటి తో డ్రమెటిక్ ఐన్ ఉండకూడదు. కేవలం కాజల్ లేదా ఐలైనర్ చాలా గ్లిట్టర్స్, స్పార్కెల్స్ బావుండవు. ఇక లిప్ కలర్ అయితే పాప్ కలర్స్ కు దూరంగా వుండాలి. సింపుల్ కలర్స్ చాలు. కన్సీలర్ లేదా కాంపాక్ట్ ను మాయిశ్చురైజర్ తర్వాత అప్లయ్ చేస్తే మచ్చలు మార్కులు కవర్ అవుతాయి. ఆఫీస్ కు వెళ్తూ మరింత మేకప్ తో మరీ ప్రత్యేకంగా కనబడటమూ బావుండదు.

Leave a comment