ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది ‘బివా’ అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా ఉన్నామో తెరపైన కనిపిస్తూ వుంటుంది. పూర్తయ్యాయి ఇక దిగండి అని మిషన్ సంకేతం ఇస్తుంది. ఈలోగా తొక్కి తొక్కి జిమ్ కష్టం కూడా పూర్తయి పోతుంది. ఒకే మీషన్ రెండు లాభాలు.

Leave a comment