ఒక్కతే ఉంటుంది

సైబీరియాలోని ఒల్కాన్ ద్వీపంలో ల్యుబోవ్ మొరఖ్ డోర్ అన్న 76 ఏళ్ళ వృద్దురాలు ఒక్కతే నివశిస్తుందట. ఆమె పైన ఒక డాక్యూమెంటరీ కూడ వచ్చింది. సంవత్సరంలో ఐదు నెలలు మంచుకు గడ్డకట్టిపోయే ఈ ద్వీపంలో కుక్కలు,పిల్లులు,ఆవులు,గొర్రెలు పెంచుకుంటూ వాటికి కావల్సిన తిండి,తిప్పలు చూసుకుంటుంది. స్కెటింగ్ చేస్తూ బైకాల్ సరస్సు దగ్గరకుపోయి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. ఇక వేసవిలో కలప సేకరించటం తనకోసం కావలిసిన ఆహారపదార్ధాలు సమకుర్చుకోవటం చలిలో ఏందొరకవో అవన్ని చేర్చి పెట్టుకోవడం చేస్తు ఉంటుందట. ఈ వయసులో ఒంటరిగా అక్కడ నివశిస్తుంది. అంటే ఎంతో ధైర్యం కావాలి. యైభై ఏళ్ళు దాటుతుంటే ఒక ప్రతిదానికి దిగులు పడుతూ ఎవరో ఏదో చేయాలని ఆశపడే కోట్ల మంది వృద్దులకు ఈమె రోల్ మోడల్ కదా.