వేసవిలో బజ్జీలు , గారెలు ఎప్పుడు నోరూరిస్తాయి. కాని ఈ వేసవి వెళ్లే వరకు వాటి ఊసు ఎత్తకండి అంటున్నారు డైటిషియన్లు. చివరకు డ్రై ఫ్రూట్స్ కూడా తగ్గించి చల్లని పానీయాలు వదిలేసి తాజా పండ్ల రసాలు ఫుల్ గా తీసుకొండి అంటున్నారు. సబ్జా గింజలు నానేసి ప్రతి ఫ్రూట్ జ్యూస్ లో కలుపుకోమంటున్నారు. ఈ వేసవిలో ఎన్నో రకాల పండ్లు వస్తాయి. అన్ని జ్యూస్ లకు పనికి వచ్చేవి నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, పూదినా రసం మజ్జిగలతో పాటు ఫ్రూట్ జ్యూస్ లతో కడుపు సగం నింపేస్తే వేసవిని జాలీగా దాటేయవచ్చు అంటున్నారు.

Leave a comment