చిన్నారుల దత్తతకు సంబందించి దంపతులు ఒంటరి పురుషులు మహిళల వరసలో ఒంటరి మహిళలకే ప్రాధాన్యం ఇస్తామంది.కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ పరిధిలోని సెంట్రల్ అడాప్షన్ రిసెర్చి ఎజెన్సీ. ఈ నిర్ణయం వెనక కారణం చాలా సంతోషాన్నిచ్చేదిగా ఉంది.మన దేశంలో మహిళలకి ఎంతసంపాదన ఉన్న పెళ్ళి,పిల్లల విషయాలు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అలాంటిది ఏదో కారణాల చేత ఒంటరిగా మిగిలిన స్ట్రీలు తమకి తోడుగా ఒక పాపనో బాబో ఉండాలని నిర్ణయం తీసుకోగలిగారంటే అది చిన్న విషయం కాదు.సామాజికంగా ఎంతో వ్యతిరేకత దాటుకుని ఆ ఒంటరి మహిళ ఈ నిర్ణయం తీసుకుని అంటుంది కనుక వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నాం అని ప్రకటించింది.సెంట్రల్ ఎడాప్షన్ రీసెర్చ్ ఏజెన్సీ.

Leave a comment