డ్రింక్ లు,ఫేస్ క్రీమ్ లు సబ్బులను ఆర్గానిక్ రంగుల్ని అందించే లిప్ స్టిక్ ట్రీ లు అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతంలోనివే అయినా భరతదేశంతో సహా శ్రీలంక,బ్రెజిల్,మెక్సికో,పెరూ,ఆఫ్రికా దేశాల్లో కూడా పెంచుతున్నారు. ఈ చెట్టు కాయ లోపల నారింజ రంగు గింజలుంటాయి.వీటిని అనటోలు అంటారు.ఆహారపదార్ధాల్లో వాడే పసుపు,నారింజ రంగులను ఈ చెట్టే ఇస్తుంది.ఈ ఆర్గానిక్ రంగు పొడిని సాస్,బటర్ చీజ్,పాప్ కార్న్ వంటి ఆహారపదార్ధాల్లో వాడతారు. సబ్బులు,లిప్ స్టిక్,మాయిశ్చరైజర్లకు రంగు అద్దేందుకు వాడతారు. దీని గింజలతో పాటు ఆకులు ఎంతో మంచివి..ఈ గింజలో ఉండే విటమిన్ ఏ కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. గింజలు పొడి పేస్ట్ గా చేసి రాస్తే చర్మం పై ముడతలు,మచ్చలు పోతాయి. ఈ లిప్ స్టిక్ ట్రీ శాస్త్రీయ నామం బిక్సా ఒరెల్లానా.

Leave a comment