కుంకుమ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే మెదడు చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతోంది.బహిష్టు సమయంలో వచ్చే నెప్పికి ఉపశమనంగా ఉంటుంది. కుంకుమ పువ్వులో క్రొసిన్ ,సాఫ్రనాల్ ,ప్రిక్రోసిన్ వంటి ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే నిద్రలేమి సమస్య పోతుంది. ఇకిడాస్ సే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. ఈ పువ్వులో కేసరాలు మాత్రమే పనికివస్తాయి. ఇవి కాస్త చేదుగా ,తియ్యగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. పాలతో ఈ కుంకుమ పువ్వును ఎవరైనా తీసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరం.

Leave a comment