శారీరక వ్యాయామాలు మంచి ఆరోగ్యానికి,ఫిట్ నెస్ కు తప్పనిసరి అన్నా విషయంలో ఎలాంటి సేందేహం కూడా పెట్టుకోనక్కర్లేదు. వ్యాయామం చేస్తేనే మనసు శరీరం చురుగ్గ ఉంటాయి. మంచి ఆరోగ్యం దక్కుతోంది. ఒక తాజా అధ్యయనం ఫిట్ నెస్ పేరు తో,అతిగా చేసే వ్యాయామం ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది అంటున్నారు ఎంతోమందికి తీరైన శరీరం పట్ల ఎంతో శ్రద్ధ ఉంటుంది. కానీ అదే పనిగా గంటల కొద్దీ జిమ్ లో గడిపే వ్యాయామాలు వల్ల మెదడులో కొంత భాగం చురుకు దనం తగ్గుతూ ఉండటం పరిశోధికుల దృష్టికి వచ్చింది. అతిగా వ్యాయామాలు చేస్తూ వుంటే ఆలోచనలు ప్రణాళిక బద్దంగా సాగవనీ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదనీ ,విపరీతమైన అలసట వల్ల ప్రవర్తన సంబంధిత లోపాలు తలెత్తుతున్నాయని పరిశోధికులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment