కాలు బయట పెడితే దుస్తులను సందర్భానికి తగ్గట్టు రకరకాల ఫ్యాషన్ మారుస్తుంటారు అమ్మాయిలు సాధారణంగా పాయింటెడ్ హైహీల్స్ పైకే వాళ్ళ దృష్టి పోతా వుంటుంది. అయితే ఇంట్లో వేసుకునేందుకు మాత్రం హవాయి చెప్పులు వాడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే వాకింగ్ కు ఎక్కువ దూరం నడిచేందుకు మాత్రం ఈ చెప్పులు తగినవి కావు. ఈ హవాయి చెప్పుల పట్టీల వాళ్ళ పాదాలకు, కాలి వేళ్ళకు రాపిడి తగిలితే బొబ్బలు వస్తాయి. బొటన వేలు దాని పక్కన వేలు కలిపి పట్టీఉ ప్రెస్ అయ్యే చొట తప్పని సరిగాయి పడుతుంది. అలా ఏ మాత్రం ఇబ్బంది అయినాఎప్పులు మార్చాలి. మిగతా సమయంలో ఇంట్లో రిలాక్స్ గా వుండేప్పుడు పాదాలకు గట్టిగా వుండే షూస్ వాడకుండా మెత్తగా వుండే హవాయ్ చెప్పులే వాడాలి. అప్పుడే పాదాలు మృదువుగా ఉంటాయి.

Leave a comment