పద్మ కుప్ప

తాజా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికాలోని రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు. భిలాయ్ లో పుట్టిన పద్మ కుప్ప.వరంగల్ ఎస్ ఐ టి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.అమెరికాలో ఫోర్డ్ క్రిస్లర్ కార్స్ వంటి సంస్థల్లో పని చేసింది. 2018 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున మిచిగన్ రాష్ట్రంలో 41 డిస్ట్రిక్ట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది.ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థి పైన 5611 ఓట్ల మెజారిటీతో గెలిచింది పద్మ కుప్ప.పర్యావరణ పరిరక్షణ పిల్లలకు నాణ్యమైన విద్య మహిళలకు పురుషులతో సమానంగా వేతనం కోసం పని చేస్తానంటోంది పద్మ.