చలికాలం రాబోతుంది. ముందుగా వచ్చే సమస్య కాళ్ళు పగుళ్ళు బారటం. ఇంక ఆ పగుళ్ళలో మురికి చేరడం చూసేందుకు బావుండదు, పైగా పగిలిపోయిన చర్మం లేచి దుస్తుల పోగులు లాగేస్తూ ఉంటాయి. జార్జెట్ సిల్క్ వంటి దుస్తుల పోగులు ఈ బిరుసెక్కిన చర్మం తగులుకుని లేచి వచ్చేలా చేస్తాయి. ఈ పగుళ్ళు వదలాలంటే, బక్కెట్లో సగానికి గోరు వెచ్చని నీళ్ళు నింపి, రాతి ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి పాదాలు ముంచి పది, పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత బ్రష తో పాదాలపై పేరుకున్న మురుకి తొలగించి నిమ్మరసం, రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపినా మిశ్రమాన్ని పాదాలకు అప్లయ్ చేసి రాత్రంతా వదిలేస్తే పాదాలు మెత్తగా అయిపోతాయి పగుళ్ళు మానుతాయి. ఒక వారం పాటు ఇలా చేస్తే పగుళ్ళు మానుతాయి.

Leave a comment