వంటింట్లో ఇంటిల్ల పాదికీ కావల్సిసిన ఆహ్లాదం సక్సెస్ ఫుల్ గా తయ్యారవ్వుతూ వుంటుంది కానీ కొన్ని వంటింటి టిప్స్ తేలికే వంట ఇంకాస్త ఏ జీ అవ్వుతుంది. వంకాయలు తరిగే లోపే నల్లబడతాయి. ఒక్క సారి తలిమ్పులో వేసినా నల్లగా అవ్వుతాయి. వుడికే కూరలో పాలు పోస్తే వంకాయలు రంగు పోకుండా అవ్వుతాయి. కుక్కర్ రెగ్యలర్ గా వాడుతూ వుంటే అడుగున నల్లగా అయిపోతుంది. ఈ నలుపు పోవాలంటే ఇందులో నిమ్మవుప్పు వేసి నీళ్ళు పోసి పొయ్యి మీద కాసేపు ఉడికిస్తే ఆ నలుపు పోయి కుక్కర్ తెల్లగా అయిపోతుంది. ఉల్లి పాయ ముక్కల్ని వేయించేప్పుడు కుడా ఇలా కాపిన పాలు పోస్తే ముక్కలు వేగంగా వెలుగుతాయి. రుచి కుడా పెరుగుతుంది వెల్లుల్లి రెమ్మలు తీసి పెనం పైన వేసి కొద్దిగా వేడి చేసి ఆ తరువాత పొట్టు వలిస్తే తేలిగ్గా వస్తాయి. క్యారెట్, బెండ, దొండ ఇలా ఏమైనా కూరగాయలు వాడినట్లు కనిపిస్తే నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ కూరగాయలను అందులో నానిస్తేనే ఫ్రెష్ గా తాజాగా ఉంటాయి.

Leave a comment