ప్రపంచంలో బీచ్ లు అన్ని ఒకేలా ఉండవు అంటారు పరిశోధకలు.సముద్రతీరంలో ఎగిసిపడే అలలు మెత్తని స్వచ్ఛమైన ఇసుక కనిపిస్తాయి.కొన్ని ప్రాంతాల భూగోళిక  పరిస్థితులు బట్టి సముద్రాల దగ్గర ఇసుక రకరకాల రంగుల్లో ఉంటుంది. ఎర్రగా నల్లగా గులాబీ రంగు ఇసుక ఉన్న బీచ్ లు ఉన్నాయి.అలా ఉండేందుకు కారణాలు వివరిస్తున్నారు పరిశోధకులు .అలాటి ప్రాంతం బీచ్ లలో హవాయి ద్వీపం లోని కాలాయ్ కు దక్షిణాదిన ఉన్న పాపా కోలియా ని మహానా బీచ్ అంటారు.ఈ తీరంలో ఇసుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది.సముద్రం అడుగున 50 వేల సంవత్సరాల క్రితం ఆకుపచ్చ శంఖాల పొడి పేరుకుపోయింది.కొన్నాళ్ళకు సముద్రం లోపల అగ్నిపర్వతం పేలి పోయి ఆ లావా పొడి ఇసుకలో కలిసిపోయి ఈ రంగు ఏర్పడిందని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment