ప్రతి వాళ్లు ఆహారానికి సంబంధించి కొన్ని సూత్రాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. ఔషధ గుణాలున్న పదార్థాలు వినియోగించి ఆహారం తయారు చేసి వంట చేసే విధానం, పద్ధతి పదార్థాల మిశ్రమ విధానాలు తెలుసుకోవటం ఆహార పరిమితి కోరటం వయసు ఆరోగ్యం సమయా సమయాలు దృష్టిలో ఉంచుకోని వీటిలో ముఖ్యమైనవి ,పోషక విలువలతో కూడిన షడ్రుచుల సమ్మేళనమైన ఆహారం తినాలి. హితమైన ఆహారం మితంగా తీసుకొంటే శరీరం నిర్మాణంలో ప్రత్యేకమైన ఎదుగుదల కనిపిస్తుంది.ఇది శరీరానికి మనకు మంచిది. రాత్రి భోజనం తరువాత తప్పని సరిగా కాసేపు నడవాలి.తిన్న ఆహారం జీర్ణం అయ్యాకనే నిద్రకు ఉపక్రమించటం మంచిది.

Leave a comment