Categories
WhatsApp

పెద్దవాళ్ళ క్రమశిక్షణ ఫలితం ఇది.

ఇంట్లో మాములుగా పెద్దవాళ్ళు చెప్పిన మాటవిని క్రమశిక్షణతో వుండే పిల్లలు ఇంటికి ఎవరైనా రాగానే ఆ సందర్భంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ముందు పెద్దవాళ్ళు ఆంక్షలు పెట్టలేదని క్రమశిక్షణా చర్యలు ఉండవని ధీమా. ముఖ్యంగా ఏడెనిమిడి సంవత్సరాల లోపు పిల్లలు కొత్తవారి ముందు ఇంట్లో ఎప్పుడు సాధారణంగా చెయినంత అల్లరి చేస్తారు. ఇలా తరచూ జరుగుతుంటే కారణం గుర్తించాలి. చిన్ని చిన్ని తప్పుల్ని కూడా పట్టించుకుని, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని విసిగించినందువల్లే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమో అర్ధం చేసుకోవాలి. అతిగా క్రమశిక్షణ చర్యలవల్లె ఇతరుల ముందు ఛాన్స్ తీసుకుంటుంటారని గ్రహించాలి. అలాంటప్పుడు ఇంటికి ఎవరేనా వస్తుంటే ముందుగానే పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇంటికొచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళముందు ఏం చేయాలో ఏం చేయోద్దో స్పష్టంగా అర్ధం అయ్యేలా కాస్త కఠిన ధోరణి లో వివరించాలి. అనుచితమైన ప్రవర్తనకు తర్వాతైనా శిక్షణ తప్పదని ముందే వివరించి చెప్పాలి. వచ్చిన వాళ్ళ ముందు పిల్లల్ని దండించడం మాత్రం అస్సలు చేయకుడదు.

Leave a comment