పెరుగుతో మరింత రుచి

కూరగాయలు,చేపలు,మాంసం ఉడికించే సమయంలో పెరుగు కలపడం ఎంతోమందికి అలవాటు.ఇలా ఉడికించడం వల్ల మరింత పోషకాలు అందుతాయని పెరుగులో కొవ్వు,క్యాలరీలు ఉండకపోవడం వల్ల దీనిని వివిధ ఆహారాలలో నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పెరుగు కీలక పాత్ర వహిస్తుంది. పెరుగులో ప్రోటీన్లు,క్యాల్షీయం,విటమిన్ బీ12 ఉంటుంది.ఉడికించిన తర్వాత కూడా పెరుగులోని పోషక విలువలు అలాగే ఉంటాయి.