కొందరికి ఇళ్ళల్లో కిక్కిరిసినట్లు ఎన్నో సమన్లుంతాయి. వాటిలో ఎన్నో అందమైనవి కళాత్మకమైనవి వున్నా సరే, పేరుకు పాయిన ఎన్నో వస్తువుల వల్ల కొన్ని అద్భుతమైన వాటి అందం కనిపించకుండా పోతుంది. కొన్ని వస్తువులు సెంటిమెంట్ పేరు తో, కొన్ని వదిలేయండం గురించి నిర్ణయించు కోలేకనూ ఇంట్లో సామాన్లు నిండి పోతుంది. ఒక్కసారీ ఇల్లు మొత్తం వస్తువులు గమనించాలి. ఇంట్లో వున్న అలమారాలు, బీరువాలు, పుస్తకాలు పెట్టుకునే అరలు, అటకలు అన్నింటిని పరిశీలించి చూసి లేదా అన్ని ఓసారి కిందకు దించి పెట్టుకుని అప్పుడు అవసరం, అనవసరం అన్నవి వేరు చేస్తూ సర్దుకోవాలి. అవసరం అంటే ఓ సంవత్సర కాలంగా వాడకపోతే సర్దుకోవాలి. అనవసరం అంటే ఓ సంవత్సర కలంగా వడక పొతే అది ఉపయోగ పాడని లిస్టులో పెట్టేయోచ్చు . కొన్ని రాబోయే సంవత్సరాల్లో వాడేందుకు పనికి వచ్చేవి ఉండవచ్చు. వాటిని అటక పైన భద్రంగా పెట్టోచ్చు. పనికి రానివి గుర్తించాక వాటిని వదిలించు కోవడం తేలికే. పనికి వచ్చే వాటిలో పెద్దల జ్ఞాపకంగా వున్నవి, పెళ్లి జ్ఞాపకాలు, కొన్ని పిల్లల కు అపురూపంగా ఇచ్చేవి తప్పించి అర్ధం లేని సెంటిమెంట్  తో అన్ని వస్తువుల తో ఇల్లంతా పేర్చుకుంటూ పొతే ఇంటి అందమే పోతుంది. ఇల్లు విశాలంగా, అందంగా ఉండాలంటే కొంత మనస్సు బిగబట్టి వస్తు వ్యామోహం తగ్గించుకోవాలి. అదీ పాత వస్తు వ్యామోహం.

Leave a comment