మొక్క జొన్నలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. విటమిన్ సి, విటమిన్ ఇ ఖనిజాలు యంతాక్సిడెంట్లు పుష్కలంగా వున్నా మొక్క జొన్నలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి. రుచికి ఆరోగ్యానికి అందానికి కుడా ఇవి మంచివే. వీటితో ఎన్నో వంటలు చేసుకోవచ్చు. వీటిని సెనగపిండితో చేర్చి పోకోడీలు వాడవచ్చు. వీటితో చేసే సమోసాలు చాలా ప్రేత్యేకం. బంగాళా దుంపల తో కలిపి మసాలా వడలు చాలా బావుంటాయి. మొక్క జొన్న గింజలు, దానిమ్మ గింజలు కమలా పండు ముక్కలు, చిలకడ దుంపలు, చింత పండు రసం కలిపి చేసే చాట్ పుల్లలు ఎంతో ఇష్టపడతారు. సూప్ కుడా చాలా ఆరోగ్యం. రుచికి బావుంటుంది. చాలా ప్రాంతాల్లో గోధుమలు, బియ్యం కంటే మొక్కజోన్నలే ప్రధాన ఆహారం. మొక్కజొన్న పిండి , కార్న్ సిరప్ తో తయారు చేసిన పదార్ధాలు విరివిగా వాడుజలో వున్నాయి.

Leave a comment