కొర్రలు,మొక్కజొన్న,జొన్నలు,గోధుమలు విశేషంగా వాడండి. శక్తితో పాటు కొలెస్ట్రాల్ పెరగదు అంటున్నాయి అధ్యాయనాలు. చివరకు అరిసెలు కూడా కొర్రలు, జొన్నలతోనే వాడండి. బియ్యంతో సమానమైన రుచితో ఉంటాయి అంటున్నారు. వడలు, బోండాలు చేయాలంటే శనగపప్పు, మినపప్పు కాకుండా మొక్కజొన్న పిండి, జొన్నలు, గోధుమ పిండి వాడమంటున్నారు. వడలకు మొక్కజొన్నలు,అలసందలు బావుంటాయి. దోసెలకు కూడా గోధుమ రవ్వ,కొర్ర పిండి, జొన్న పిండి వాడితే దోసెలు కమ్మగా వస్తాయి. చిలకడ దుంపలు, పెసలు వాడి చేసే బొబ్బట్లు చాలా బావుంటాయి. ఇక చిరు ధాన్యాల వైపు చూడండి ఆరోగ్యం అంటున్నాయి అధ్యాయనాలు.

Leave a comment