పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటే చిన్నచిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు .వాతావరణం చల్లగా ఉంది కనుక మరీ వేనీళ్ళ స్నానం తగ్గించాలి.అసలు ఏ కాలంలో అయినా గోరు వెచ్చని నీళ్ళ స్నానం మంచిది. వేడినీళ్ళు శరీరంలో ఉన్న కొద్దిపాటి సహజ నూనెల్ని తగ్గించేస్తాయి.స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకొవాలి. ఇది ఒంట్లోని తేమను పోనివ్వకుండా అపుతుంది. ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉండాలి. శీతాకాలమైన పరే రెండు లీటర్ల నీళ్లు తాగాలి. చేపలు ,వాల్ నట్లూ ,ఒమేగా త్రీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తింటే చర్మానికి అవసరమైన సహాజ నూనెలు ఉత్పత్తి అవుతాయి.

Leave a comment