నిర్మాతగా శృతి

శృతిహాసన్ కేవలం నటి మాత్రమే కాదు సంగీతం,పాటలు చిత్రలేఖనం ఇలా చాలా రంగాల్లో తనని తాను నిరూపించుకొంటూ ఉంటుంది. పాటల ఆల్బమ్స్ వచ్చాయి,అన్నింటిలోనూ ఆమె దైన ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఇప్పుడు శృతిహాసన్ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాబోతుంది.జయ్ ప్రకాశ్ రాధకృష్ణన్ దర్శకత్వంలో వస్తున్నా ‘ది మస్కిటో ఫిలాసఫీ’అన్న చిత్రానికి ఆమె సహానిర్మాతాగా వ్యవహారిస్తుంది. తమిళ,మళయాల భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.