ప్రొఫెసర్ అజ్రాఘని 

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మందు కనిపెట్టే వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండటం తప్ప ఇంకో గత్యంతరం లేదు. అయితే కరోనా వైరస్ నిర్ములించేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ లోగా లండన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లో మహిళా పరిశోధకులు కరోనా గురించి ప్రజలకు చెతన్యం కలిగించే పనిలో ఉన్నారు. ప్రాఫెసర్ అజ్రాఘని కరోనా వైరస్ కు సంబందించిన అత్యంత ప్రధానమైన సమాచారం ప్రభుత్వానికి అందించటంలో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. సెంటర్ ఫర్ ఇన్ ఫెక్షయల్ డిసీజ్ అనాలిసిస్ లు తనతోటి ఉద్యోగులతో కలిసి అజ్రాఘని కోవిడ్ -19 గురించి సమాచారం అందిస్తున్నారు. గతంలో 2003 లో సార్స్ మహమ్మారి గురించిన సమాచారం ఇస్తూ ప్రభుత్వానికి సాయం చేశారు ఈ శాస్త్రవేత్తలు.