జ్ఞానపీఠ్ ఆవార్డ్ గ్రహీత కు వెంపు గా ప్రసిద్ధి చెందిన కుప్పలి వెంకటప్ప పుట్టప్ప కుమారుడు పూర్ణ చంద్ర తేజస్వీ రాసిన గొప్ప నవల ప్రొఫెసర్ కర్వాలో నిజానికి ఈ నవల పరిచయం కోసం కు వెంపు ప్రస్తావన అవసరం లేదు. పూర్ణ చంద్ర తేజస్వీ నిస్సదేహంగా గొప్ప రచయిత. అయన తండ్రి గారైన వెంకటప్ప ను అయన గొప్పతనాన్ని ప్రచారం చేసుకోకుండానే పుట్టి పెరిగిన ఊరికి దూరంగా అడవి దగ్గరలో వ్యవసాయం చేసుకొంటూ తనకు ఎదురైన అనుభవం లోకి వచ్చిన గ్రామీణుల జీవితాలను ప్రేరణగా తీసుకొని రచనలు చేసారు పూర్ణ చంద్ర తేజస్వీ. 2007 లో అయన మరణించారు. ఈ పుస్తకం కన్నడం లో 40 సార్లు పునర్ నిర్మితమైంది ఇంగ్లీష్,హిందీ,మరాఠీ,మళయాళం ,జాపనీస్ భాష ల్లోకి అనువాదం అయింది. ఈ పుస్తకంలో కొంత తేజస్వీగారి ఆత్మకధగా చెబుతారు.

ప్రొఫెసర్ కర్వాలో కీటకాల పైన పరిశోధన చేస్తూ అడవి దగ్గరలో సొంత లేబొరేటరీలు ఉంటాయి. అడవికి సంభందించిన,వ్యవసాయానికి సంభందించిన సమస్య విషయాలు ముఖ్యంగా ప్రతి కీటకం గురించి క్షుణంగా తెలుసు. కథలో రచయిత కూడా అడవి దగ్గరగ అన్ని ఉల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు.కార్వాలో ముందన్న సాయంతో ఎన్నో రకాల కీటకాలు జీవితాల అద్యాయనం చేస్తూ వుంటారు. ముందన్న ఒకసారి చెట్టుమీద ఎగిరే బల్లిని చూసాను అని చెపుతాడు.ఆ బల్లిని చూసేందుకు,దాని జీవితాన్ని అధ్యయనం చేసేందుకు అడవిలోకి ప్రయాణం కడతారు రచయిత కార్వాలో ముందన్న మరో ఇద్దరు సహాయకులు ఆ అడవి సౌందర్యాన్ని అడవిలో నివసించే జంతువులు,పక్షులతో పాటు అడవిని నమ్ముకున్న ఆ గ్రామీణుల జీవితాలను కూడా ఎంతో గొప్పగా చిత్రించారు పూర్ణ చంద్ర తేజస్వీ. ఎన్నో కష్టాలు పడి ఆ ఎగిరే బల్లిని కనిపెడతారు ప్రకృతి అంతు చిక్కని రహస్యాలు మల్లి వాళ్ళ కళ్ళ ముందు లోయలోకి ఎగురుతూ అదృశ్యమైంది బల్లి. ప్రకృతి పైన చుట్టు మనుషుల పైన ఒక మనిషికి ఎంత ప్రేమ దయ ఉండాలో కర్వాలో పాత్రలో చూపించారు రచయత తేజస్వీ. పట్టణాల్లో జీవించే వాళ్ళకు కలలో కూడా ఊహింపశక్యం కాని అడవి సౌందర్యం ఈ ప్రొఫెసర్ కర్వాలో ఈ పుస్తకాన్ని అనువాదం చేసిన శాఖమూరు రాంగోపాల్ గారు అభినందినియులు ఎంతో శ్రమతో చక్కగా అనువాదం చేసి తెలుగు పాఠకులకు అపురూపమైన బహుమతి ఇచ్చారు రాంగోపాల్ గారు నవలతో అనుభంధంగా ఇంకో నాలుగు పెద్దకథలున్నయి తప్పకుండా నవల చదవండి.

కాపీలకు వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: శాఖమురు రాంగోపాల్ గారు
ఫోన్: 9052563666

Leave a comment