చల్లగా హాయిగా వర్షపు జల్లులో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో కాంతి వంతమైన రంగులు బావుంటాయి. ఏ వస్త్ర శ్రేణి అయినా గులాబీ,ఆకుపచ్చ,ఆరెంజ్ వంటి అందమైనవి, కాస్త పొడుగ్గా లావుగా ఉండే ముదురు రంగులు బావుంటాయి. చిన్న ప్రింట్ లలో గులాబీ,ఆకుపచ్చ రంగుల దుస్తులు చాలా అందం ఇస్తాయి. ఎరుపు వెచ్చదనానికి సంకేతం. ఈ కాలంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇక మబ్బుపట్టిన వాతావరణాన్ని ఉత్సహంగా మార్చేయాలి అనుకుంటే సూర్య కాంతి ప్రతిబింభించే పసుపు రంగు దుస్తులు వేసుకోవాలి. ఇక ఉదా అంత చక్కని రంగు ఇంకోటి లేదు. ప్రశాంతంగా ఉండాలంటే నీలం రంగు ప్రకృతిని ప్రతిబింభించే ఆకుపచ్చ రంగు వేసుకోవడం బెస్ట్.

Leave a comment