ఆత్మరక్షణ నేర్పే రెడ్ బ్రిగేడ్

రెడ్ బ్రిగేడ్ ట్రస్ట్ ద్వారా 75000 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చింది ఉష విశ్వకర్మ.జీవితంలో లైంగిక వేధింపులకు గురైన ఉష విశ్వకర్మ ఈ రెడ్ బ్రిగేడ్ ద్వారా 15- 20 నిరాయుధీకరణ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ కావాచ్ మిషన్ కింద 56000 మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చింది. బాలికలకు మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో ఆలోచించే దిశగా ఉషా 700 వరకు వీధి నాటకాలు నిర్వహించింది.ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో 2011లో ఏర్పాటైన రెడ్ బ్రిగేడ్ స్త్రీ శక్తిని పెంచుకోవాలని చెపుతోంది. పాఠశాలలు  రైల్వే లు, బ్యాంక్ లు, పోలీస్ లు ఇతర వృత్తుల్లో ఉన్న మహిళలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్పిస్తుంది ఉషా విశ్వకర్మ.