చిన్నతనం లోనే దేవదాసీగా మార్చారు కుటుంబీకులు 2006 లో ప్రభుత్వాధికారులు ప్రభుత్వ సంరక్షణగా కేంద్రానికి తరలించారు.తర్వాత అన్యాయ్ రహిత జిందగీ (అర్జ్ ) అనే స్వచ్చంధ సంస్థలో చేర్చారు. అక్కడ నుంచి నాలాగా చీకట్లో బతికే మహిళలను బయటికి తెచ్చేందుకు పనిచేశాను. అర్జ్ సహకారం తో గోవాలో స్విఫ్ట్ వాష్ లాండ్రీ (Swift Wash Laundry) ప్రారంభించాను. వేశ్య గృహాల నుంచి బయటికి వచ్చిన వాళ్లకు ఇందులో ఉపాధి దొరుకుతోంది అంటోంది భీమవ్వ ఛాల్వాడీ. ఇక్కడ 500 మంది పనిచేస్తున్నారు. కొందరికి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చాము అంటోంది భీమవ్వ .గత సంవత్సరం సి ఐ ఐ ఫౌండేషన్ విమెన్ ఎగ్జంప్లర్ అవార్డ్ ఇచ్చారు. వ్యాపారిగా మారాక తన చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేసింది భీమవ్వ.

Leave a comment