రోజంతా తరగని శక్తి తో ఎనర్జిటిక్ గా ఉండాలంటే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ స్దానంలో నెమ్మదిగా అరిగే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్, పూర్తిస్ధాయి ధన్యాలు, కంద, చిలకడ దుంప వంటివి రోజు మొత్తం శక్తిని అందిస్తూనే ఉంటాయి. అలాగే త్వరత్వరగా అరిగిపోయే చక్కర, వైట్ బ్రెడ్ వంటివి బ్లడ్ షుగర్ స్దాయిని పెంచి ఇన్సులిన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇవి వర్కఉతస్ తర్వాత తినాలి. అప్పుడు తరిగి పోయిన ఇంధన నిల్వలను శరీరం దాచుకున్న కొవ్వు నిల్వల నుంచి కాకుండా ఈ అదనపు కార్పోరేట్స్ ద్వారా గ్రహిస్తుంది. తేలికగా ఆరగని కార్బోహైడ్రేట్స్ శరీరాన్ని అత్యంత శక్తి మంతంగా ఉంచుతాయి. రోజంతా ఓపిక తరిగి పోకుండా వుంటుంది.

Leave a comment