Categories
WoW

రోజుకో కప్పు తో అందమే అందం.

కప్పు టీ తో బద్ధకం ఎగిరి పోతుంది. బోలెడంత ఉత్సాహం వస్తుంది. కప్పుల కొద్దీ టీలు తాగి జీవితం గడిపేయవచ్చుననే  టీ ప్రేమికులు కుడా వుంటారు. కానీ ఈ టీ తాగితే అందాల సుందరి అయిపోవచ్చు. పట్టులగా చర్మం నునుపెక్కి చెక్కిన శిల్పంలాగా అయిపోవచ్చట. దీని పేరు వైట్ టీ. పేరులో వైట్ ఉన్నంత మాత్రాన తెల్లగా వుండదు లేత పసుపు రంగులో మెరిసిపోతూ వుంటుంది. లేత తేయాకు చిగుళ్ళతో తేయాకు మొగ్గలతో తయ్యారు చేస్తారు దీన్ని. అంత సుతారంగా తయ్యారావ్వుతుంది కనుకనే ఖరీదు కుడా ఎక్కువే పైగా రోలింగ్ అక్రిడేషన్ వంటివి కుడా ఎం చేయకుండా అంటే ప్రాసెస్ చేయని టీ ఆకు తో చేస్తారు ఈ వైట్ టీని. రోజుకో కప్పు తాగినా చాలు చర్మం నిగారింపు తో మెరిసి పోతుందిట.

Leave a comment