దేవాలయాల పైన చారిత్రక కట్టడాల పైన గండ భేరుండ పక్షులు రాచరికానికి గుర్తులుగా కనిపిస్తాయి. ఇది రిచ్ నెస్ కు , శక్తికి సింబల్. ఇప్పుడీ సింబల్ జ్యూవెలరీలోకి, పట్టు చీరల పైకీ దూకేసింది. ముత్యాలు రత్నాలతో స్వర్ణకారులు ఈ గండభేరుండాన్ని నగల్లోకి తీసుకువస్తే నేత కళాకారులు దాన్ని పట్టు చీర పైకి తెచ్చి రాయల్ లుక్ చూపించారు.
ఇప్పుడీ పట్టు చీరెలకు మ్యాచింగ్ గా ఆభరణాలు ట్రెండ్ సృష్టించాయి. అజంతా ఎల్లోరాల చిత్ర శిల్పకళలు చీరెల పైకి వచ్చి ఫ్యాషన్ ప్రపంచంలో నిలబడిపోయినట్లు ఇప్పుడు గండభేరుండాల కథ నడుస్తుంది.

Leave a comment