ఆరోగ్యపూరితమైన పంథాలో బరువు తగ్గాలి అనుకొంటే నెమ్మదిగా చిరుధాన్యాలు అలవాటు చేసుకోవటం మంచిది. సజ్జలు పోషకాలకు నిలయం. సజ్జలతో చేసిన తియ్యని బూరెలు చాలా బావుంటాయి. సజ్జల్లో ఐరన్ ,మెగ్నిషియం ,పోటాషియం ,కాల్షియం ,కాపర్ జింక్ మాంగనీస్ వంటివి ఉంటాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి.సజ్జలు కండరాలను శక్తి వంతంగా మార్చి ,రక్తంలోని ట్రైగ్లిజరాయిడ్స్ ను తగ్గించి గుండె జబ్బుల్నినివారింస్తుంది. వీటిల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్వవస్థకు మేలు చేస్తాయి. మహిళలల్లో రుతు సంబంధిత క్రాంల్స్ నుంచి ఈ సజ్జలు ఉపశమనం కలిగిస్తాయి.

Leave a comment