సామాజిక బంధాల్ని పెంచే ఆకర్షణ

మనుషులు మొట్ట మొదటి పరిచయంలో కనిపించే రూపం,నిలబడే తీరు,మాట్లాడే పద్దతికి మంచి మార్కులు పడతాయి. ఎదుటి వాళ్ళకు వెంటనే నచ్చిపోతారు. దాదాపుగా వాళ్ళలో ఉండే మైనస్ పాయింట్లు కూడా మరుగున పడిపోతాయి అంటున్నాయి అధ్యయనాలు. ఆకర్షణీయమైన రూపంతో సామాజిక సంబంధాలు ఎక్కువగా కొనసాగించగులుతారని అలాగే వారి మానసిక స్థాయి స్థితిగతులు బావుంటాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కార్పోరేట్ ఆఫీసులో పిఆర్ జాబ్స్ కోసం ఆకర్షిణీయమైన రూపం ,ఇంగ్లీష్ ఉచ్చరణ కావాలని యాడ్స్ లో చూస్తూ ఉంటారు. అందుకే ఈ కాలపు యువతులు వ్యాయమాలు యోగా సహజ థెరఫీలతో అందాన్ని మెరుగుపరుచుకొనే ,మేకప్ చికిత్సలు ,కాస్మోటిక్ సర్జరీలలో శరీరక రూపం మెరుగయ్యేలా చూసుకొని సామాజిక భాందావ్యాలను తీర్చిదిద్దుకొంటున్నారని ఒక అధ్యయనం చెపుతుంది.