నీహారికా,

సంక్రాంతి అంటేనే ప్రతి ఇల్లు పచ్చ తోరణమై ముగ్గులతో వీధులు కలకలాది, కొత్త పంటలతో , వంటలతో పరిమళించే ఒక ఉత్సవం. ఇది కళ్ళకు కనువిందు చేసే  కనిపించే పండగ. పవిత్రమైన ధనుర్మాసంలోనే ప్రతి ఇంటికీ సంక్రాంతి శోభా మొదలవ్వుతుంది. ముంగిట్లో ఇంద్రధనస్సు ను తలపించే రంగ వల్లులు, గిబ్బెమ్మల్, పిల్లల గాలిపటాల పందాలు, కోడి పందాలు, కోడి పందాలు ఇది సందడి సంక్రాంతి. పంట చేతి కొచ్చే తరుణం లో, ఆనందం కోలాహలం తో మూడు రోజుల పాటు ఉత్సవం లా చేసుకునే పెద్ద పండగ ఇది మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడోవ రోజు కనుమ, బొమ్మల కొలువు భోగి మంటలు, సంక్రాంతి కి అరిసెలు విందులతో ప్రతి ఇల్లు ఒక హరి విల్లవుతుంది. పాది పశువులను పూజించి, పితృ దేవతలను సంతృప్తి పరచి, వినోదాలతో బంధు మిత్రులతో కలిసి చేసుకునే ఈ పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు.

Leave a comment