కొన్ని రకాల ఆహార పదార్ధాలు శరీరం తీసుకోవాలి అంటే అవి వండే పద్ధతిలోనే వండాలి. కాయగూరలు ,ఆకు కూరల్లోని పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని చిన్న మంటపైన నెమ్మదిగా ఉడికే లాగా వండాలి. గిన్నె మూత పెట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ నెమ్మదిగా ఉడక నివ్వాలి.వేపుళ్ళు తినక పోవటం మంచిది. కూరగాయలు ఉడికించిన నీటిని రసం ,సాంబారు ,ఇతర వంటకల్లో వాడుకొంటే ఆయా వాటిల్లో ఉండే పోషకాలు అందుతాయి. వంటకు రుచి కూడా వస్తుంది. మెత్తగా ఉడికిన పదార్థాలు తేలిగ్గా జీర్ణం అవుతాయి కూడా.

Leave a comment