స్వయంగా చదువుకొన్న

నాలో వంటరితనం జయించేందుకు చదువు ఒక్కటే మార్గం అనిపించింది. ఇంటర్ పూర్తి చేసుకుని బయట ప్రపంచంలో అడుగు పెట్టేసరికి నా కంటూ ఎవ్వళ్ళు లేరు.వీరప్పన్ కూతుర్ని.నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్నెప్పుడూ ప్రేమగానే చూసేవాళ్ళు మా నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకొన్నాడు.కానీ నేను లాయర్ ని అయ్యి పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయాలనుకున్నాను.కష్టపడి ఏడెనిమిది బడుల్లో పాఠాలు చెప్పుకుని అలా వచ్చిన డబ్బుతో చదువుకున్నాను అంటోంది వీరప్పన్ కూతురు విద్యా రాణి.మా నాన్నను చిన్నప్పుడు ఒక్కసారి చూడటమే ఆయన్ను కలుసుకోనే లేదు.మా అమ్మ స్థానిక మహిళలకు అండగా ఉండేది నేను ఆ దిశగా నా చుట్టుపక్కల వాళ్లకు ఏదైనా సహాయం చేయాలనుకున్న. ఉన్నత విద్య అందించేందుకు విద్య అకాడమీ ని స్థాపించాను ఇది గిరిజన విద్యార్థులను నీట్ పరీక్ష కు సిద్ధం చేస్తోంది. గృహిణులకు స్వయం ఉపాధి మార్గాలను చూపిస్తోంది అంటోంది విద్యా రాణి. తమిళనాడు రాష్ట్ర  బి జె పి యువ నాయకురాలిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది.