సెల్ఫీలే అడుగుతారామే

నేను యాక్టర్ అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయటం మరిచి పోయాను అంటుంది సాయిపల్లవి.నేను ప్రాక్టీస్ చేయాలంటే తప్పని సరిగా చదివింది రివిజన్ చేయాలి. మెడిసిన్ లో చాలా విషయాలు మరిచిపోతున్నాను. కష్టపడి చదివింది మరిచిపోతున్నందుకు ఎంతో బాధపడుతున్నాను . అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆధునిక పరిశోధనలు వస్తాయి .అవన్నీ స్టడీ చేయటం వృత్తిలో భాగం అయినా ,ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టినా నన్ను మందుల చీటి గురించి అడిగే వాళ్ళకంటే సెల్ఫీ అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారేమోనని నవ్వేసింది సాయిపల్లవి.