షాంపూ వద్దు

సాధారణంగా చుండ్రు వుంటే యాంటి డాండ్రఫ్ షాంపూలు వాడుతారు. కానీ దీనివల్ల మాడులో సాధారణ యాసిడ్ అల్క లైన్ లేదా పి . హెచ్ బ్యాలన్స్ దెబ్బ తింటుందని అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు వాష్ చేసుకొన్నాక రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ ను ముగ్గు నీళ్ళలో కలిపి స్నానం చివరిలో తలపైన పోసుకొంటే సరిపోతుంది. లేదా షాంపూ చేసుకునేందుకు అరగంట ముందు యాపిల్ సిడార్ వెనిగర్ మాడుపై తేలిగ్గా మసాజ్ చేసుకోవాలి. అలాగే ఆలివ్ ఆయిల్ వేడిచేసి కాటన్ ఊల్ తో మాడుపై ఆప్లయ్ చేయాలి రాత్రంతా ఆలా వదిలేసి ఉదయాన తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.