సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంపాదిస్తాడు కూడా  ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం కలిగించాలనుకొన్న ఆ విఘ్నన్ని తొలగించాలనుకొన్న అది పరమేశ్వరుడు సంకల్పమే  వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడు అవతరించిన రూపాలు 175 వరకు ఉన్నాయంటారు.కానీ సాధారణంగా ప్రజలు ఆచరించేది లింగ రూపంలో ఉన్న మహాశివుని ఈ భక్త సులభుడు భస్మధారి, భూతనాథుడు అయిన ఈశ్వరుడు ఈ రకంగా పిలిచినా పలికే కరుణామూర్తి.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment