స్నేహితులుంటే జీవితం నిండుగా ఉంటుందన్న మాట. నిజమే స్నేహితులు ఎలా ఉంటారు.ఎక్స్ పర్ట్స్ స్నేహితుల గురించి ఏం చెపుతారంటే వాళ్ళు ఎంత దూరంగా ఉన్న వెన్నంటే ఉంటారు. దుఃఖంలో తోడుగా ఉంటారు. కష్టాల్లో ఉంటే మేమున్నమంటారు. మరింత ప్రేమతో మైమరిస్తారు. నిస్వార్ధంగా ఎప్పుడైన ఏ సాయం అయినా చేయగలిగేది మంచి స్నేహితులు ఇలాంటి స్నేహంతో ఫలానా పద్దతులు ,రూల్స్ అంటూ ఎ జెండరీలు ఏమీ ఉండవు. నిజంగా ఇలాంటి స్నేహితులు దొరికితే ఆ స్నేహాన్ని కాపాడుకోవాలి. హృదయపూర్వకంగా స్నేహం చేసేవారిలో దీర్ఘకాలం ఒత్తిడి ఉండవు. స్నేహంలో స్వార్ధం లేకపోతే మానసికమైన ఆనందం దక్కుతుంది. మానసిక శారీరక ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయి. జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకోవాలి.

Leave a comment