యుక్త వయసులో బరువు పెరిగినా, గర్భధారణ తర్వాత చర్మం సాగి చారలు పడుతాయి . అలాగే అధిక బరువు నియంత్రించుకొనేందుకు ఆహార నియమాలు పాటించినా శరీరం సన్నగా అవుతుంది . అప్పుడు సాగిన చర్మం పూర్వ స్థితికి రాక చారలుగా కనిపిస్తుంది . పై పూతలు వ్యాయామాలతో వీటిని తగ్గించవచ్చు . చర్మానికి ప్రతిరోజు ఆముదం రాయాలి . చారలున్నా ప్రాంతంలో వేడిచేసి ఆముదం రాస్తూ మసాజ్ చేయాలి . ఓ అరగంట తర్వాత స్నానం చేసేయచ్చు . అలాగే రాత్రివేళ నిద్రకు ముందు బాదం నూనెలో మచ్చలున్న చోట మసాజ్ చేస్తే నెమ్మదిగా చారలు తగ్గుతాయి . కలబంద గుజ్జు రాసిన ఈ చారలు తగ్గిపోతాయి .

Leave a comment