సక్సెస్ కు కారణం విమర్శలే

ఎదో ఒక సినిమాలే అని రాజీ పడే ప్రసక్తే లేదు . కెరీర్ ఓ దశను వచ్చాక అవకాశాలు తగ్గిపోతాయని కొందరు వచ్చిన వాటిని వద్దనకుండా అందిపుచ్చుకొంటారు . కానీ నావిషయంలో అలాఇష్టపడను . నా ప్రయారిటీ ఉండాలి ,కథ నాకు నచ్చాలి ,నాకు పేరుతేవాలి . ఇంకా వీలైతే నాకు ఇష్టమైన డాన్స్ ఉంటే మరీ బాగుంటోంది అంటుంది తమన్నా . పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దం గడచినా తన రూటు మార్చుకోలేదు అంటుంది తమన్నా . ఇప్పటికే 70 చిత్రాలు పూర్తి చేశాను . చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చి ,వయసులో పాటు నా టాలెంట్ ని ,నటించే శక్తిని మెరుగులు పెట్టుకొన్నాను . ఇంత దాక వాచ్చానంటే నేను ఎదుర్కొన్నవిమర్శలే కారణం . ఎవ్వళ్ళూ విమర్శించక పోతే నే ఎంత ఎదిగే దాన్ని కాదు . ఆ విమర్శలు వల్లనే నా చిత్రాల ఎంపిక పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాను అంటోంది తమన్నా .