వేసవి ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. అయినా ఉద్యోగాలకు ,చదువులకు బయటికి వెళ్ళక తప్పదు.మంచి నీళ్ళు ,కొబ్బరి నీళ్ళు ,మజ్జిక వంటివి తీసుకోవాలి.నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చ ,బొప్పాయి, ద్రాక్ష వంటివి తీసుకోవాలి. వాతావరణంతో వేడితో ఉదయం వండిన పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది. తాజాగా వండుకోవటం అవసరం.సలాడ్స్ కూడా తాజాగా తయారు చేసుకోవాలి. ఎక్కుడకు వెళ్ళిన వెంట మంచి నీళ్ళు ఉండవలిసిందే . కొంత కాలం డైట్ కోక్ లు అవతల పెట్టి కొబ్బరి నీళ్ళు, తేనె ,సహాజసిద్దమైన బెల్లం వేసిన నిమ్మరసం,మజ్జిగా జీలకర్ర కూరలతో చేసిన రసాలు తాగటం మంచింది.

Leave a comment