Categories
Wahrevaa

సూపర్ ఫుడ్ జాబితాలో బీట్ రూట్.

చెనో పాడ్, పాలకూర, కినోవా వంటి సూపర్ ఫుడ్ జాబితాలోకి వస్తుంది బీట్ రూట్. తియ్యగా ఎర్రగా నిగనిగలాడే బీట్ రూట్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీసు, విటమిన్ సి తో పాటు యాoటి ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలకు నిలయం. బిటానిన్ గా వ్యవహరించే ఫిటో న్యూట్రియంట్ల నుంచి బీట్ రూట్ కు ఎర్రని రంగు వస్తుంది. జీర్నకారక పీచుకు మంచి ఆధారం గట్టిగా, మృదువైన చర్మంతో, మంచి రంగుతో ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఫ్రీజ్ చేయాలి. గరిష్ట ప్రయోజనం పొందాలంటే పూర్తి పూర్తి బీట్ రూట్ దుంపను ఒకేసారి తినాలి. బీట్ రూట్ ని చల్లని నీళ్ళతో కడిగి పదిహేను నిముషాలు స్టీమ్ చేసి, పై తోలు వలిచి తింటే ఇందులో వుండే ఫిటో న్యూట్రియంట్లు పోకుండా వుంటాయి లేదా జ్యూస్ రూపంలో పచ్చిగా తీసుకోవచ్చు. గ్రిల్ లేదా రోస్ట్ చేసి సైడ్ డిష్ గా ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఇది కంటి దృష్టిని, పూర్తిస్థాయి నాడీ టిష్యూల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Leave a comment