స్విట్జర్లాండ్ లో శ్రీదేవి విగ్రహం

జగదేక సుందరి శ్రీదేవికి ఒక అపురూపమైన గౌరవం దక్కనుంది. సౌందర్య స్వరూపిణి అయిన శ్రీదేవి విగ్రహాన్ని తమ దేశంలో నెలకొల్పుతామని స్విట్జర్లాండ్ అధికారులు సన్నాహలు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన చాందిని మూవీ ఇక్కడే తెరకెక్కించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్న పర్యటనగా ఇక్కడ శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2016లో యాశ్ చోప్రా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.ఈయన సినిమాలు ఎక్కువగా స్విట్జర్లాండ్ లోనే తెరకెక్కాయి.ఆ సినిమాలు కారణంగా స్విస్ అందాలు ప్రపంచవ్యాప్తమై ఇక్కడకు వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగిందని అధికారు చెబుతున్నారు. ఇప్పుడు శ్రీదేవి విగ్రహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.