ఇప్పుడన్నీ  టాబ్లెట్లే  

18 రకాల వెజిటేబుల్స్ టాబ్లెట్స్. అల్లం,వెల్లుల్లి పుట్టగొడుగు పిండి, క్యాబేజి పొడి, లోటస్ రూట్ పౌడర్ మొదలైనవి మార్కెట్ లో  దొరుకుతున్నాయి. పాలు,టీ, కాఫీ సూప్ లు కూడా మాత్రలు క్యూబ్ ల రూపంలో దొరుకుతున్నాయి.ఎన్నో రకాల ఫ్లేవర్ లలో దొరికే సూప్ క్యూబ్ వేడిగా ఉన్న నీళ్ళలో వేస్తే చాలు కరిగి సూప్ గా అయిపోతుంది.పాలు కాఫీ గ్రీన్ టీ లు కూడా ఇంతే ఆ టాబ్లెట్ ను వేడి నీళ్ళలో వేస్తే చాలు ఘుమఘుమ లాడే కాఫీ, టీ రెడీ గా అయిపోతాయి.పాలయితే ఎంత చిక్కగా కావాలనుకుంటే అన్ని టాబ్లెట్స్ కలుపుకుంటే చాలు తీపి కూడా తేనె కూడా క్యాప్సిల్ రూపంలోనే దొరుకుతోంది ఒక్క మాత్రలో  కోరుకొన్న రుచులు  పొందవచ్చన్న మాట.