ఎన్ని గొప్ప మాల్స్ వచ్చినా స్థానికంగా పేరు తెచ్చుకునే కొన్ని బజార్లకు ఉన్న గ్లామర్ ఎంతమాత్రం తగ్గదు. హైదరాబాద్లో షాపింగ్ కాంప్లెక్సులు ఎన్నో వెలిశాయి.కానీ దేశంలో అతిపెద్ద అతి పూరాతన గాజుల మార్కెట్ లాడ్ బజార్ ప్రాముఖ్య ఎఫ్పుడు తగ్గలేదు.లక్క గాజులు దొరుకుతాయి కనుక లాడ్ బజార్ అంటారు.వెండి,గాజు,ఇఅతర లోహాలతో చేసిన గాజులకు ఇది ప్రసిద్ది. భారతదేశంలో బాగా ఆరితేరిన కళగా ప్రసిద్ది చెందిన మట్టిగాజులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కొన్ని వందల రకాల గాజుల గుట్టలు కనిపిస్తాయి.మహ్మద్ కూలీ కుతుబ్ షా తన కూతురి వివాహా సంద్రభంగా ఈ లాడ్ బజార్ నిర్మించాడని చెబుతారు. చార్మినార్ ప్రాంతంలో ఈ గాజులు కొనకుండా హైదరాబాద్ పర్యటన ముగిసిపోదు.

Leave a comment