మాస్క్ శరీరం లో భాగంగా అయిపోయింది రోజంతా మాస్క్ ధరించడంతో పీల్చే వదిలే ఊపిరి కారణంగా మాస్క్ లోపలి ఉష్ణోగ్రత తేమ పెరిగిపోతాయి.తద్వారా చెమట పట్టడం మొటిమలు రావటం ఎక్కువవుతోంది. మాస్క్ అంచులు చెంపలకు రుద్దుకుని ఇరిటేషన్ మొటిమలు రావచ్చు మాస్క్ తో ముక్కు పైన చర్మం బరుసుకొని పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది ఈ చర్మ సమస్యలు రాకుండా గంటకోసారన్న ఏకాంత ప్రదేశాన్ని వెళ్లి కాసేపు తీసి కొద్ది సేపు తాజాగా గాలి మొహానికి తగిలేలా చూసుకోవాలి. పాలిస్టర్, జార్జెట్, నైలాన్ మాస్క్ లకు బదులు కాటన్ మాస్క్ ధరించాలి. మాస్కులు ప్రతిరోజు ఉదయం ఎండలో ఆరనివ్వాలి.

Leave a comment