తలకింద దిండు ఉంటేనే చాలా మందికి సౌకర్యంగా ఫీలవుతారు . దిండు లేకుండా నిద్రపోలేరు కూడా కానీ ఈ తలగడల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అనారోగ్యాలు ,ఎలర్జీలు వస్తాయి . వాటిని ఎంత శుభ్రం గా ఉంచుకొంటే అంత మంచిది . దిండు కవర్ ప్రతివారం మార్చాలి . తప్పని సరిగా వారానికోసారి దిండ్లను ఎండలో వేయాలి దిండులోని క్రిములు ఎండకు నశిస్తాయి . తలపై జిడ్డు ,చెమట ,మురికి దిండుపైకి చేరి నల్లగా మరకలు పడతాయి . కనుక వాటిని ఏడాది కి ఒకసారి మార్చేయాలి . అవసరం అయితే ఆరు నెలలకొసరి మార్చినా పర్లేదు .

Leave a comment