ద్రౌపతి పాత్ర పోషించే అవకాశం రావటం నా అదృష్టం ,గౌరవం గా భావిస్తున్నా . జీవితకాలం గుర్తుండే పాత్ర ఇది ఎన్నో మహాభారతాలు వచ్చాయి . అవన్నీ పురుషుల దృష్టికోణం లోంచి చూశాం . కానీ ఈ మహా భారతం ద్రౌపతి దృష్టికోణంలోంచి నడుస్తుంది . అందువలనే చాలా ఆశక్తిగా ,కొత్తగా అర్థవంతంగా ఉంటుంది . ఇంతకు ముందు మహారాణిగా నటించను కానీ ఇది ప్రత్యేకం చాలా బరువైన పాత్రా అంటోంది దీపికా పడుకొనే . మధు మంతెన తో కలసి దీపికా ఈసినిమా ని నిర్మిస్తుంది . చపాక్ ,83 తరువాత దీపికా నిర్మిస్తున్నమూడో చిత్రం ఈ మహాభారతం దేన్నీ రెండు,మూడు లేదా ఎక్కువ భాగాలుగా తెరకెక్కుతుంది కథలో కనిపించే ప్రత్యేకత చూసే దాని నిర్మాణంలో భాగం పంచు కోవాలనుకున్నాను అంటోంది దీపకా

Leave a comment